డిజిటల్ పోలీసింగ్‌లో మెదక్ జిల్లా ముందంజ – ఐటీ టీంకు కామెండేషన్ లెటర్లు.

తేది:24-12-2025 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా : ఐటీ వ్యవస్థల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మెదక్ జిల్లా పోలీస్ సిబ్బందికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీపీ (టెక్నికల్ సర్వీసెస్) శ్రీ వి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ గారి చేతుల మీదుగా ఐటీ కోర్ టీం సభ్యులు ఎ. అనిల్, రసాల అమరనాథ్‌తో పాటు టెక్ టీం రైటర్స్ మౌనిక, రాజు తమ నిబద్ధతతో కూడిన సేవలకు గాను కామెండేషన్ లెటర్స్‌ను స్వీకరించారు.
ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు అవార్డు గ్రహీతలను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి పోలీస్ శాఖ పనితీరును మరింత మెరుగుపరచాలని సూచించారు.
ఈ ఘనత మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఐటీ రంగంలో సాధిస్తున్న ప్రగతికి నిదర్శనంగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *