డీప్‌ఫేక్‌ల పరిశీలనలకు, వాటిపై వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్‌మీడియా సంస్థలతో సమావేశానంతరం ‘కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం ప్రకటించారు. భారతీయ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు నాడుచుకోవాలని ఏడు రోజుల గడువు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.