గబ్బిలాలతో కరోనా వ్యాపిస్తుందా? ప్రస్తుత ఈ ప్రశ్న అందరినీ వేధిస్తోంది. ఈ వైరస్ ఎలా వ్యాప్తిస్తుంది, దానికి దోహదపడుతున్న మార్గాలేమిటో బోధపడక ఇంకా సందేహాలు వెంటాడుతున్నాయి. వైరస్ నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ వ్యాధిబారిన పడకుండా తప్పించుకోవచ్చుననేది కూడా నిర్ధారణ కాలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా 10 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నిర్ధారణవ్వగా 50 వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. ఇక కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి కారణాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వైరస్‌లకు, గబ్బిలాలకు ఉన్న సంబంధాలు, వైరస్‌ల వ్యాప్తిలో ఇవి పోషిస్తున్న పాత్ర ఏమిటనేది కీలకంగా మారింది.