పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ఏ పనీ చేయలేదని కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శించారు. తన కొడుకు కేటీఆర్ కోసం కేసీఆర్ వేలాది కోట్ల రూపాయల అవినీతి చేశారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో శుక్రవారం జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. “కేసీఆర్ నీ టైం అయిపోయింది. అవినీతి కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన అవసరం వచ్చింది. కేసీఆర్ అవినీతిపై విచారణ చేయించి జైలుకు పంపడం ఖాయం.” అని అమిత్ షా అన్నారు.