
తేది: 22-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS పాపన్నపేట మండలం రిపోర్టర్ జోగెల్లి దేవచితం.
మెదక్ జిల్లా:పాపన్నపేట మండలం నాగ్సన్పల్లి గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం శుక్రవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గా దండెం సుశీల గారు, ఉప సర్పంచ్‌గా ఎం.డి. సిరాజ్ గారు బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఐదుగురు వార్డు సభ్యులు తమ పదవులకు ప్రమాణం చేయగా, మరో నలుగురు వార్డు సభ్యులు వ్యక్తిగత కారణాల వల్ల కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి భానుకుమార్ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్.ఐ.) నాగరాజు గారు హాజరై అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
నూతన పాలకవర్గం గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా వెల్లడించింది.