
తేది:22-12-2015మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash.
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రముఖ నాయకులు, సామాజిక సేవకులు వెంకట స్వామి గారి వర్ధంతి సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ గారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, సమాజ సేవకు అంకితమైన వెంకట స్వామి గారి సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని వెంకట స్వామి గారికి శ్రద్ధాంజలి ఘటించారు.