తేది:22-12-2025
TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ జిల్లా:ఎన్నికైన సర్పంచ్ కన్నబోయిన సంధ్యా స్వామి, ఉపసర్పంచి ఎల్ల బోయిన లింగమూర్తి తోపాటు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామపంచాయతీ కార్యదర్శి చేత గ్రామసభ సమావేశంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన నాయకులు సర్పంచ్: కన్నబోయిన సంధ్యా స్వామి ఉపసర్పంచి: ఎల్ల బోయిన లింగమూర్తి ఒకటో వార్డు, శిరవేల సారమ్మ రెండో వార్డు,వెలుపల నవ్య మూడో వార్డు, దాసరి రాకేష్ నాల్గవ వార్డు మండబోయిన రాజు ఆరో వార్డు వెలుతుల సంగీత ఏడవ వార్డు బాబు దాసరి రేణుక ప్రమాణస్వీకారం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ కన్నబోయిన సంధ్యా స్వామి మాట్లాడుతూ నన్ను ఓటేసి గెలిపించిన గొల్లపల్లి గ్రామ ప్రజలకు అలాగే పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ గొల్లపల్లి గ్రామపంచాయతీలో ఈ కొత్త నాయకత్వంతో గ్రామ అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.