
తేది: 20-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జ్ ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల:జగిత్యాల బైపాస్ రోడ్డులో ఉన్న శ్రీవేద ఆసుపత్రిలో డా బి. శిరీష ఎంబిబిఎస్, స్త్రీ వైద్యులుగా ప్రజలను మహిళలను మోసం చేస్తు చలామణి అవుతున్నారని జగిత్యాల జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. స్త్రీల వైద్యులు అంటే గైనకాలజిస్ట్ అని,కానీ గైనకాలజీ కోర్స్ లేకుండా, ఆమె స్త్రీల వైద్యులు ఎలా అవుతారని, డిస్ప్లే బోర్డులపై, వైద్యుల చీటిపై స్త్రీ వైద్యులు అని ఎలా రాస్తారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇది
జాతీయ వైద్య కమిషన్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నియమాలు, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టంకు విరుద్ధం అని వైద్య నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ ఆసుపత్రి పై సంబంధిత వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.