తేది:20-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా 21వ డివిజన్లో కొండా సురేఖ మంత్రివర్యులు పలు సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు రూ.50 లక్షలు కేటాయించారు. ఇవి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలో భాగం. అని
ఈ కార్యక్రమంలో వరంగల్ అడిషనల్ కలెక్టర్, కార్పొరేటర్లు మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.ఈ అభివృద్ధి ప్రాజెక్టులు స్థానికులకు మెరుగైన మార్గాలు, నీటి నిర్వహణ సౌకర్యాలను అందించనున్నాయి. మంత్రివర్యులు మాట్లాడుతూ, “జనసేవ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ పనులు త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రసాంగం చేస్తూ ప్రభుత్వ నిబద్ధతను ప్రస్తావించారు. కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాజెక్టులు గ్రామీణాంచల అభివృద్ధికి మైలురాయిగా మారతాయని
తెలిపారు