

తేది:20-12-2025 TSLAWNEWS సదాశివపేట మండలం కోఆర్డినేటర్ మన్నె మల్లేశం.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలం, సదాశివపేట పట్టణ పరిధిలో గల గొల్లగూడెంలో ఇండో బ్రిటిష్ ప్రైవేటు ఐఐటీలో బాల్య వివాహ విముక్తి స్పందన కల్చర్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రోగ్రెసి వ్ ఎడ్యుకేషన్ సంగారెడ్డి జిల్లా వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
జిల్లా ఇన్చార్జి మానేయ మాట్లాడుతూ బాల్య వివాహాలు మీ దృష్టికి వస్తే 1098 కు ఫోన్ చేయండి అని తెలిపారు. అంతేకాకుండా బాల్య కార్మికులుగా హోటల్ బేకరీ బట్టల షోరూంలో గాని ఎవరైనా పని చేసినట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ సమాచారం చేరవేయండి అక్రమ రవాణా చేసిన తక్షణమే మీరు సమాచారాన్ని చేరవేయండి అని తెలిపారు.
ఫోక్స్ చట్టం పై కూడా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శంకర్ రెడ్డి,సంపత్ కుమార్,మన్నె శ్రీనివాస్,విద్య ప్రకాష్,వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.