టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ లో బూతు పదాల పట్ల విమర్శలు రావడంతో ‘రానా నాయుడు’ తెలుగు వెర్షన్‌ను స్ట్రీమింగ్ నుంచి నెట్‌ఫ్లిక్స్ తొలగించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ 2 వస్తుందని హీరో వెంకటేష్ తాజాగా ప్రకటించారు. మొదటి సీజన్ లో నాయుడు ఏం చేసాడో తెలియదని, ప్రపంచ వ్యాప్తంగా ఈ సిరీస్ చూశారని చెప్పారు. ఎవ్వరినీ హర్ట్ చేయకుండా సీజన్ 2 లో జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ వెబ్ సిరీస్ కు సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించారు.