తేది:20-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా చీఫ్ అడ్వైజర్ ఎర్ర. శ్రీహరి గౌడ్.
వెంటనే ఇండ్ల స్థలాలు అక్రిడేషన్ జారీ చేయాలి
జిల్లా కలెక్టర్ సానుకూల స్పoదన-టిజెయు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్.
సంగారెడ్డి జిల్లా:సమాజానికి కళ్లూ, చెవులుగా వ్యవహరించే జర్నలిస్టులు నేడు అనేక సమస్యల మధ్య పని చేస్తున్నారని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరంచటం లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించటం సరైయిoది కాదని తెలంగాణ జెర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం. గిరి పేర్కొన్నారు. గురువారం టి జె యు నూతన కమిటీ జిల్లా కలెక్టర్ కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జెర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు తగిన శ్రద్ధ చూపడంలో విఫలమవుతున్నాయని తెలిపారు.రాష్ట ప్రభుత్వo ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేది జెర్నలిస్టులే నన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్థంభంగా గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధుల సమస్యలు పరిష్కారమైతేనే పారదర్శక, బాధ్యతాయుత పాలన సాధ్యమవుతుందిని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ (టీజెయు) సంగారెడ్డి జిల్లా కమిటీ జర్నలిస్టుల సమస్యలపై తక్షణ జోక్యం చేసి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించా మని పేర్కొన్నారు..ప్రభుత్వ పథకాలు, ప్రజా సమస్యలు, పాలనలోని లోపాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చోరువ చూపకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వ అధికారుల పనితీరును నిత్యం ప్రజలకు తెలియజేస్తున్నారు. జర్నలిస్టులు భద్రతా లోపం, ఆర్థిక అస్థిరత, ఆరోగ్య సమస్యలు, ప్రభుత్వ అధికారుల సహకారం లభించటం లేదన్నారు. జెర్నలిస్ట్ సమస్యల లేమితో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఈ సమస్యలు మరింత తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. సంగారెడ్డి ప్రెస్ క్లాబ్ ఉన్నా జెర్నలిస్టలకు ప్రయోజనo లేదన్నారు. గడిచిన 20 ఏండ్ల నుంచి ఏ ఒక్క జెర్నలిస్ట్ ఉపయోగపడలేదన్నారు. వేంటనే జెర్నలిస్టులకు ఉపయోగ పడేలా చెర్యలు చేపట్టాలన్నారు. ఒకే వర్గం ఆధిపత్యం లో ఉండటం సరి కాదన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి తగిన చెర్యలు చేపట్టాలని కోరడం జరిగిందన్నారు.జర్నలిస్టులకు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు, జర్నలిస్టు గుర్తింపు కార్డులు, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, నివాస స్థలాల కేటాయింపు, వెంటనే కల్పించాలన్నారు.నూతన అక్రెడిటేషన్ కార్డుల జారీ వంటి కీలక డిమాండ్లను ప్రస్తావించారు. నూతన అక్రెడిటేషన్ కార్డుల జారీ విషయంలో ప్రెస్ క్లబ్ చైర్మన్ సమర్థంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని వెంటనే తగిన చెర్యలు చేయట్టాలని పేర్కొన్నారు. అక్రిడేషన్ కమిటీ లో టి జె యు యూనియన్ అవకశాo కల్పించాలన్నారు.
జర్నలిస్టుల సమస్యలు కేవలం సంక్షేమ సదుపాయాలకు మాత్రమే పరిమితం కాకుండా, వారి వృత్తి గౌరవం, ఆత్మగౌరవానికి సంబంధించినవని టీజెయు స్పష్టం చేసింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగితే అది పరోక్షంగా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపుతుందని తెలిపారు. స్వేచ్ఛాయుతంగా, నిర్భయంగా వార్తలు రాయాలంటే వృత్తి భద్రత అత్యంత కీలకమని పేర్కొంది.అందుకే జిల్లా యంత్రాంగం ఈ వినతిని సానుకూలంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. సంగారెడ్డి జిల్లా టీజెయు కమిటీ చేసిన ఈ ప్రయత్నం జర్నలిస్టుల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తయని ప్రభుత్వ చెర్యలు కూడిన పాలన, సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక. అప్పుడు మాత్రమే ప్రజల తరఫున నిలబడే జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని టీజెయు కృషి చేస్తుందని పేర్కొన్నారు. సంగారెడ్డి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు నిజంగా ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవడానికి, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చెర్యలు చేపపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో
తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ (టీజెయు), ఉపాధ్యక్షులు శివకుమార్ పోచగౌడ్ మహేష్ గౌడ్ కార్య వర్గ సభ్యులు రాజేష్, గణేష్ జావీద్ తదితరులు పాల్గొన్నారు.