కోకాకోలా సంస్థ ఆధ్వర్యంలో అమీన్‌పూర్‌లో మెగా హెల్త్ క్యాంపు.

తేదీ:19-12-2025 TSLAWNEWS అమీన్‌పూర్ మండలం, కృష్ణారెడ్డిపేట గ్రామ రిపోర్టర్ సంతోష్ బొంగురాల.

అమీన్‌పూర్: అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణారెడ్డిపేటలో కోకాకోలా సంస్థ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. కమిషనర్ గారి పరిధిలో జరిగిన ఈ వైద్య శిబిరం స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.
ఈ మెడికల్ క్యాంపులో వివిధ విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొని, స్థానిక వాసులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. కృష్ణారెడ్డిపేట ప్రజలు, పరిసర ప్రాంతాల వాసులు పెద్ద సంఖ్యలో ఈ క్యాంపులో పాల్గొని సేవలను పొందారు.
ఇలాంటి వైద్య శిబిరాలు కొనసాగించడం ద్వారా సమాజంలో ఆరోగ్య అవగాహన మరింత పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్పొరేట్ సంస్థల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడితే ప్రజలకు మేలు చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.
కాగా, రాబోయే రోజుల్లో నిర్వహించాల్సిన మరికొన్ని వైద్య శిబిరాల తేదీలు ఇంకా ఖరారు కాలేదని, త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *