ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటినుండి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లనే ఎన్నికలు విజయవంతం -జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.

తేది:19-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా:మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, అన్ని స్థాయిల అధికారులను,సిబ్బందిని అభినందించారు.రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు అధికారులు అందరు సమన్వయంతో పనిచేయడం వల్లనే ఎన్నికలు సజావుగా నిర్వహించగలిగామని జిల్లా కలెక్టర్ తెలిపారు.పోలింగ్ రోజు భద్రతా ఏర్పాట్లు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల నిబంధనల కచ్చితమైన అమలు ఎన్నికల విజయానికి దోహదపడ్డాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా, విజయవంతంగా నిర్వహించినందుకు గాను జిల్లా అధికారులు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి
సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు–2025 మూడు దశల్లో ఎటువంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా పూర్తైన సందర్భంగా, కలెక్టర్ కు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లు బి.ఎస్. లత, బి. రాజ గౌడ్, జెడ్ పి సిఈవో గౌతమ్ రెడ్డి, డిపివో రఘువరన్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, శిక్షణ అదనపు కలెక్టర్ కన్నం హరిణి, జిల్లా అధికారులు మదన్ మోహన్, రేవంత్, కలెక్టరేట్ ఏవో హకీం, కలెక్టరేట్ కార్యాలయం సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *