
తేది:19-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.
సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) కొరకుఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(FSSAI )లైసెన్స్ , రిజిస్ట్రేషన్ మేళా డిసెంబర్ 20, 2025 నిర్వహించనున్నట్లు జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అధికారి అమృత శ్రీ శుక్రవారం నాడొక ప్రకటన లో తెలిపారు.
ఈ మేళా జిల్లాలో సంగారెడ్డి, నారాయణఖేడ్ లలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సంగారెడ్డిలో కలెక్టరేట్ కాంప్లెక్స్ లోని గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో, నారాయణఖేడ్ లో
శ్రీ వెంకటేశ్వర సినిమా థియేటర్ నందు,ఉదయం 10.00 గంటల నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆహార వ్యాపార నిర్వాహకులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు పొందడం లేదా రెన్యువల్ చేసుకోవాలని ఆమె సూచించారు. మరిన్ని వివరాలకు 9908978790, 9985600602 మొబైల్
నంబర్లలో సంప్రదించ
వచ్చని తెలిపారు.