మెదక్ తహశీల్దార్‌ గారితో TSLAWNEWS ఎడిటర్ మరియు మెదక్ జిల్లా బృందం – యువత ఉపాధిపై కీలక చర్చ.

తేది :19-12-2025మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా:గురువారం నాడు TSLAWNEWS సంపాదకులు, యజమాని, హైకోర్టు అడ్వకేట్ శ్రీ కోవూరి సత్యనారాయణ గౌడ్ గారు, TSLAWNEWS మెదక్ జిల్లా చీఫ్ అడ్వైజర్ నగులూరి స్వామీ దాస్ గారు, జిల్లా ఇన్‌చార్జ్ గొల్లపల్లి సాయ గౌడ్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్, మెదక్ నియోజకవర్గ క్రైమ్ రిపోర్టర్ సారా సురేష్, అలాగే రిపోర్టర్లు సందీప్ గౌడ్, ఎల్లం, సమయ్య గారు మెదక్ తహశీల్దార్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాల కల్పన అంశంపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఈ భేటీలో భాగంగా యువతకు ఉద్యోగావకాశాలపై ఒక జాబ్ ఆఫర్‌ను కూడా అందజేశారు.
యువత భవిష్యత్తు బలోపేతమే లక్ష్యంగా ఇటువంటి చర్చలు కొనసాగాలని ఈ సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *