తన పోరాటానికి రాష్ట్ర యువత అండగా ఉంటోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హనుమకొండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్.. ఆంధ్రాలో ఎలా తిరుగుతున్నానో తెలంగాణలోనూ అలాగే తిరుగుతా అని అన్నారు. ‘ఏ మార్పు కోసం తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది సాధిస్తా. రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయామని.. బీసీని సీఎం చేస్తామంటే బీజేపీతో కలిశా. తెలంగాణ సాధనకి మద్దతిచ్చిన వారిలో నేను ఒక్కడిని’ అని పేర్కొన్నారు.