గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య.

తేది:17-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్న గారి కృష్ణ గౌడ్.

సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డిజిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తవ్వడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నికల నిర్వహణలో భాగంగా అంకితభావంతో పనిచేసిన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది, పోలీస్ శాఖ, రవాణా శాఖ, విద్యుత్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఇతర సంబంధిత శాఖల అధికారుల సహకారం అభినందనీయమని
తెలిపారు.అలాగే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా సహకరించిన అభ్యర్థులు, మీడియా ప్రతినిధులకు శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజాస్వామ్య పండుగగా నిలిచిన గ్రామ పంచాయతీ ఎన్నికలనువిజయవంతంగా పూర్తిచేయడంలో అందరి సహకారం కీలకమైందని కలెక్టర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *