తేదీ 16-12-2025, జనగామ జిల్లా,TSLAWNEWS,మండల రిపోర్టర్ Maroju Bhaasker.
జనగామ జిల్లా: మూడవ విడత ఎన్నికల దృష్ట్యా పాలకుర్తి మండలం పరిధిలోని బొమ్మెర, గూడూరు, పాలకుర్తి మరియు ఇతర క్రిటికల్ గ్రామాలలో తగిన సంఖ్యలో పోలీస్ బలగాలతో సమన్వయంగా ఫ్లాగ్ మార్చ్‌ను విస్తృతంగా నిర్వహించడం జరిగింది.ఈ ఫ్లాగ్ మార్చ్‌ను నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశ్యం శాంతి భద్రతలను పటిష్టంగా కొనసాగించడం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం, అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం. మండలంలోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధులు, సున్నిత ప్రాంతాలు, ప్రజలు గుమికూడే ప్రాంతాలు అన్నింటినీ కవర్ చేస్తూ మార్చ్ నిర్వహించబడింది.
ఫ్లాగ్ మార్చ్ సందర్భంగా గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి,
శాంతియుతంగా ఉండాలని,
చట్టాన్ని గౌరవించాలని
ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సోషల్ మీడియా దుర్వినియోగం చేయవద్దని
అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహించవద్దని
చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని
స్పష్టంగా అవగాహన కల్పించడం జరిగింది.
పోలీస్ అధికారులు, ఎస్ఐలు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో పాల్గొని నిరంతర నిఘా కొనసాగించారు. ఫ్లాగ్ మార్చ్ సమయంలో ప్రజల నుంచి మంచి సహకారం లభించింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు.
ప్రస్తుత పరిస్థితి పూర్తిగా శాంతియుతంగా ఉందని సిఐ, ఎస్.ఐ అన్నారు.