ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నగరంలో 83 దుకాణాలు, వాణిజ్య సంస్థలకు 24 గంటలు పనిచేయడానికి అనుమతి ఇచ్చారు. దీంతో ఢిల్లీలో 24 గంటలపాటు తెరిచి ఉంచే దుకాణాల సంఖ్య 635కు చేరింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ కమిటీ (ఎస్‌ఈసీ) నిర్ణయం తీసుకుంది. కమిటీకి మొత్తం 122 దరఖాస్తులు రాగా వాటిలో 29 దరఖాస్తులను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు.