

తేది:16-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇస్తామని అన్ని రకాల సేవలకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి అన్నారు.మంగళవారం ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గర్భిణీ మహిళలకు సేవలు ఏవిదంగా అందుతున్నాయని, వారికి ఎలాంటి ఇబ్బంది కలిగిన తమను సంప్రదించాలని వారికి సూచించారు. గర్భిణీ స్త్రీలను అడిగి వారి సమస్యలపై ఆరా తీశారు. తల్లి పిల్లల ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.గర్భిణీ స్త్రీలు పది రకాల పరీక్షలు చేసయించుకునెలా ఆరోగ్యకార్యకర్తలు చూడాలని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆశవర్కర్,ఏ ఎన్ ఎం, సూపర్ వైసర్ ల పనితీరు గురించి తెలుసుకున్నారు. మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు కుడా నిర్వహిస్తామని తెలిపారు. గర్భిణీ స్త్రీలను, ప్రసవాలు జరిగిన వారిని కలిసి వసతుల గురించి ఆరాతీశారు. సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం అన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో పి హెచ్ సి ఎన్ ఎం లు,ఆశ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు.