తేది:16-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లాలో జరగనున్న మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి ఆయా ప్రాంతాలకు ఎన్నికల సామగ్రిని పటిష్ట పోలీస్ బందోబస్త్ మద్య తరలించడం జరిగిందని ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూటు మొబైల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మూడవ విడతకి సంబంధించి జిల్లాలో బుగ్గారం, ధర్మపురి,ఎండపల్లి, గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్ మండలాలలో మొత్తం 119 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని, 45 రూట్స్ లలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ , స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ మరియు ఎస్సైలతో పెట్రోలింగ్ టీమ్స్ తో మొత్తం 853 మంది పోలీసు అధికారుల సిబ్బందిచే ఎన్నికలను ప్రశాంత వాతారణంలో నిర్వహించేదుకు అన్నిరకాల పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్నికలలో పోలీసుల విధి విధానాలపై పోలీస్ అదికారులకు ,సిబ్బందికి దిశానిర్దేశం చేశామని, పౌరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రలోభాలకు తావు లేకుండా ప్రతి ఓటరు తమ ఓటు ను స్వేచ్ఛగా వినియోగించుకునే ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు . ఓటర్లు ఎవ్వరూ కూడా సెల్ ఫోన్ లు, మందుగుండు సామాగ్రి, ఇంక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, పోలింగ్ బూతు లోనికి తీసుకువెళ్లారాదని, సెల్ఫీలు దిగడం నిషేదం అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు.ఎన్నికల సంఘంచే జారీ చేయబడిన నియమాలను పక్కగా అమలు చేస్తామన్నారు.ఎన్నికలు ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందని కావున విజయోత్సవ ర్యాలీలు, బాణసంచాలు కాల్చడం, బైక్ ర్యాలీలు, డీజే లు వంటి కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధం అన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు.