అధికారులు సమన్వయంతో విజయవంతంగా ఎన్నికలను నిర్వహించాలి-జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, డిపివో రఘువరన్, జిల్లా నోడల్ అధికారులు పి. నరేష్, మదన్మోహన్, రవి కుమార్, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, డీఎస్పీ రఘు చందర్,ఎమ్మార్వోలు, ఎంపీడీవో లు, ఎం.పి.ఓ.లు

తేది:16-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

రేపు జరిగే మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. మంగళవారం రోజున పెగడపెల్లి, ఎండపెల్లి, గొల్లపెల్లి మండలంలో రేపు జరగనున్న మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఎలక్షన్ మెటీరియల్ పంపిణిని పరిశీలించారు.డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని, రిసెప్షన్ సెంటర్ ను సందర్శించి, పోలింగ్ అధికారులకు ఇచ్చిన మెటీరియల్ ను పరిశీలించారు.పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పా ట్లను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సామాగ్రిని, బ్యాలెట్ పేపర్లను, పోలింగ్ బాక్సులను పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామాగ్రిని పోలింగ్ కేంద్రం వారిగా వేరు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. బ్యాలెట్ పత్రాలు జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేయాలని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ కేంద్రం చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు. సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కల్పించాలని, విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని, త్రాగునీరు, లైటింగ్, పార్కింగ్ ప్రదేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ పర్యటనలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, డిపివో రఘువరన్, జిల్లా నోడల్ అధికారులు పి. నరేష్, మదన్మోహన్, రవి కుమార్, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, డీఎస్పీ రఘు చందర్,ఎమ్మార్వోలు, ఎంపీడీవో లు, ఎం.పి.ఓ.లు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *