
తేది:15-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ జిల్లా:తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ‘సేవాడేస్’ పేరుతో పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలు డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సభ్యులు తెలిపారు.ఈ సందర్బంగా హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎన్ఆర్ఐ దూదిపాల జ్యోతి రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి… తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సభ్యులు ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిరుపేదల కొరకు…ఆరోగ్యం, విద్య, సమాజ అభివృద్ధి, యువత అవగాహనా కార్యక్రమాలు, మాదకద్రవ్యాల నివారణపై చైతన్యం, రక్తదానం, ఆహార పంపిణీ, గిరిజన ప్రాంతాలకు మద్దతు తదితర 40పైగా కార్యక్రమాలు చేపడుతున్న TTA సంఘం సభ్యులకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని రాజేందర్ రెడ్డి తెలిపారు..NRI దూదిపాల జ్యోతి రెడ్డి మాట్లాడుతూ… తాను పుట్టి పెరిగిన నేలకు ఏదైనా చేయాలనే దృఢమైన సంకల్పంతో.. మల్లికాంబ మనోవికాస కేంద్రంలో గత 15 సంవత్సరాలుగా అనాధ పిల్లలకు సేవ చేసే భాగ్యం దేవుడు తనకు ఇచ్చాడని అనాధ పిల్లలకు ఎలాంటి అవసరం ఉన్న తనతోపాటు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సభ్యులు ఎల్లవేళలా ఉంటారని స్పష్టం చేశారు…మల్లికాంబ మనోవికాస కేంద్రంలో ఉన్న దివ్యాంగులు..అనాధ పిల్లలతో తెలంగాణ జానపద పాటలకు చిందులేసి చిన్నారులను అరవించారు.