సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పై ఏపీ సీఐడీ పిటిషన్ వేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంను ఆశ్రయించింది. కేసు విచారణ కీలక దశలో ఉండగా ట్రయల్ కోర్టు పరిధిలోని అంశంపై హైకోర్టు జోక్యం సరికాదని సీఐడీ తరుపున న్యాయవాదులు అంటున్నారు.