15-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash
మెదక్ జిల్లా, రామాయంపేట మండలం:
రామాయంపేట మండలంలోని ఝాన్సీలింగాపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. తండ్రి–కుమారుల మధ్య జరిగిన పోటీలో తండ్రి విజయం సాధించారు.
గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఆయుర్వేద వైద్యుడు డా.మనేగల రామ కృష్ణయ్య తన కుమారుడు వెంకటేష్ పై 99 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ పోటీ గ్రామంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఇద్దరు అభ్యర్థులకు గ్రామస్తుల్లో మంచి మద్దతు ఉండటంతో పోరు ఉత్కంఠభరితంగా సాగింది.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగగా, ఓటర్ల పోలింగ్ శాతం కూడా ఆశాజనకంగా నమోదైంది. చివరికి అనుభవానికి గ్రామ ప్రజలు పట్టం కట్టారు.
ఈ ఫలితం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సంబంధాలకన్నా ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యతనిచ్చిన గ్రామస్తుల నిర్ణయం ప్రశంసనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.