డిసెంబర్ 9న తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అని నాగర్ కర్నూల్ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఓట్లు కొనుగోలు చేసి అందలం ఎక్కాలని కలలు కంటున్నారు. గిరిజనులను ఆదుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు. పాలమూరులో వలసలు, ఆత్మహత్యలు ఆగలేదు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదు. ఎక్కడికి వెళ్లినా వలస వెళ్లిన పాలమూరు బిడ్డలే” అని రేవంత్ రెడ్డి తెలిపారు.