

తేది:14-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లాలో నిర్వహించిన రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ప్రస్తుతం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అనవసరంగా గుంపులు చేరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, ఎలాంటి గొడవలకు తావు లేకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు.సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ మూడవ విడత పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవర్యాలీలు ,బాణసంచా కాల్చడం, డీజే లు వంటి కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.