
తేది:14-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
షామీర్పేట్ :ఫ్లైట్ చూడాలంటే కష్టం ఫ్లైట్ ఎక్కాలంటేనే కష్టం ఉన్న ఈ రోజుల్లో షామీర్పేట్ లోని ఫ్లైట్ రెస్టారెంట్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని మాజీమంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు.ప్రజలకు నాణ్యత మైన భోజనం అందించడమే ముఖ్య లక్ష్యంతో ఫ్లై హైదరాబాద్ మల్లారెడ్డి ఎయిర్ సిటీ ఏర్పాటు చేయడం జరిగిందని మాజీమంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఆదివారం షామీర్పేట్ లోని అలియాబాద్ చౌరస్తా వద్ద ఫ్లై హైదరాబాద్ మల్లారెడ్డి ఎయిర్ సిటీ రెస్టారెంట్లు ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజలకు ఫ్లైట్లో కూర్చొని భోజనం చేసే అవకాశం ఫ్లై యజమాన్యం కల్పించిందని అన్నారు. షామీర్పేట్ అంటేనే టూరిజం అని ఆ టూరిజం లో మరో ముఖ్యమైన ఫ్లై రెస్టారెంట్ ఏర్పాటు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సామాన్య ప్రజలకు కూడా తక్కువ ధరలో ఫ్లైట్లో భోజనం చేసే అవకాశం కల్పించారని అన్నారు.