ఎన్టీఆర్ తో 170 కోట్ల బడ్జెట్ తో మరో సినిమా : త్రివిక్రమ్

|
ప్రస్తుతం త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులతో త్రివిక్రమ్ బిజీగా వున్నాడు. మరోపక్క, త్రివిక్రమ్ మరో ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ద్వారా ఆయన ఒక కొత్త హీరోను పరిచయం చేయనున్నట్టు తెలుస్తోంది. ఒక వ్యాపార వేత్త తన తనయుడిని హీరోగా పరిచయం చేయడానికి రంగంలోకి దిగాడట. 170 కోట్ల రూపాయలతో ఈ సినిమాను నిర్మించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కు పారితోషికంగా 35 కోట్లు ముట్టనున్నట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్ తరువాత చరణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ ఒక సినిమా చేయవలసి వుంది. ఆ ప్రాజెక్టు ఆలస్యమైతే త్రివిక్రమ్ ఈ కొత్త కుర్రాడితో సినిమా చేస్తాడట. లేదంటే చరణ్ ప్రాజెక్టు పూర్తయిన తరువాతనే చేస్తాడని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *