కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మన్సూర్ అలీ క్షమాపణ చెప్పాలని సినీలోకం డిమాండ్ చేస్తోంది. దీనిపై తాజాగా మన్సూర్ అలీ స్పందించాడు. మంగళవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నాపై తాత్కాలిక నిషేధం విధించి నడిగర్ సంఘం పెద్ద తప్పు చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నాపై నిషేధం విధించారు. ఏ తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పను.’ అని అన్నారు.