తేది: 13-12-2025 TSLAWNEWS తెలంగాణ ఇన్చార్జ్ గౌండ్ల రమేష్ గౌడ్.
తెలంగాణ: ఉచిత శిక్షణ కార్యక్రమాలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు 2026 జనవరి 3 నుండి ప్రారంభం కానున్నాయని రాజేంద్రనగర్‌లోని BIRED ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది.
రాజేంద్రనగర్, హైదరాబాద్‌లో ఉన్న Bankers Institute of Rural and Entrepreneurship Development (BIRED) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన యువతకు ఈ శిక్షణలు అందించనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీ నాగరాజకుమార్ గారు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. శిక్షణ పూర్తయిన అనంతరం యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు వెళ్లేలా ప్రోత్సహించబడుతుంది” అని తెలిపారు.
అందించనున్న కోర్సులు:
1. ఏసీ, ఫ్రిజ్ & వాషింగ్ మెషిన్ రిపేర్
2. మొబైల్ సర్వీసింగ్
3. ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ
ఈ మూడు కోర్సులు పూర్తిగా ఉచితంగా అందించబడతాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు.
నమోదు లింక్:
www.bired.org
మరిన్ని వివరాలకు సంప్రదించండి:
📞 93985 24699
📞 94949 63946
ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీ భవిష్యత్తును మీ చేతుల్లోకి తీసుకోండి.