ఎన్నికలను సజావుగా నిర్వహించాలి : జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.

తేది:13-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జ్ ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: జడ్పీ సీఈవో గౌతం రెడ్డి, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, జోనల్ ఆఫీసర్ మదన్ మోహన్, ఎమ్మార్వోలు, ఎంపీడీవో లు, ఎం.పి.ఓ.లు

రెండవ విడత పంచాయతీ ఎన్నికల జరిగే మండలాల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పంచాయతీ ఎన్నికల్లో నిబంధనల ప్రకారం ఎన్నికల సిబ్బంది తమ విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.
శనివారం రోజున జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ రెండవ విడత పోలింగ్ జరిగే సారంగాపూర్ మండలంలోని డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రెండవ విడత పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 14 న జరుగుతున్నాయని, ఎన్నికల సిబ్బంది శిక్షణ కార్యక్రమాల్లో చెప్పిన విధంగా నిబంధనలు పాటిస్తూ తమ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని, ఎక్కడ ఎటువంటి అలసత్వం జరగడానికి వీలు లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తూ విధులు నిర్వహించకూడదని, ఎక్కడ ఎటువంటి వివాదాలు లేకుండా సజావుగా ఎన్నికలు జరిగేలా చూడాలని, ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందినదా, లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ అన్నారు.సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి, ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలని తెలిపారు. ఎన్నికల విధిని నిర్వహించే సిబ్బందికి గ్రామ పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శు లు, ఎంపిడిఓ లు అవసరమైన తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, ఎలక్ట్రిసిటీ, వాహనాలు ఇతర అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ తెలిపారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జడ్పీ సీఈవో గౌతం రెడ్డి, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, జోనల్ ఆఫీసర్ మదన్ మోహన్, ఎమ్మార్వోలు, ఎంపీడీవో లు, ఎం.పి.ఓ.లు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *