

తేది:13-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జ్ ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల: గర్భాశయ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ తో చెక్ పెట్టవచ్చు అని డా. హేమంత్ అన్నారు. వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేద్దామని ఐఎంఏ జగిత్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్ పిలుపునిచ్చారు. స్థానిక ఐఎంఏ హాల్ లో ఐఎంఏ జగిత్యాల శాఖ మరియు జగిత్యాల గైనకాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్ మాట్లాడుతూ హెచ్ పి వి వ్యాక్సిన్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ప్రతి మహిళ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.
గైనకాలజీ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ సిహెచ్ పద్మిని కుమార్ మాట్లాడుతూ దేశంలో క్యాన్సర్ మరణాలు రోజురోజుకు పెరుగుతున్న సందర్భంలో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, దాని ద్వారా క్యాన్సర్ నివారణ సాధ్యపడుతుందని పేర్కొన్నారు. 9 సంవత్సరాలు నిండిన నుండి 45 సంవత్సరాలు వచ్చేవరకు ప్రతి మహిళ ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చునని తెలిపారు.
ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల ఐఎంఏ హాల్ లో ప్రతినెల రెండవ శనివారం రోజున సర్వైకల్ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ ను అందించే విధంగా చర్యలు చేపట్టామని జగిత్యాల ప్రజలు దాన్ని వినియోగించుకోవాలని కోరారు.
జగిత్యాల పట్టణ ప్రజల చైతన్యంతో శనివారం జరిగిన వ్యాక్సినేషన్ లో 43 మంది బాలికలు మరియు మహిళలు వ్యాక్సినేషన్ చేసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో గైనకాలజి అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ గుడూరి శ్రీలత, ఐ ఎం ఏ కోశాధికారి డాక్టర్ కోటగిరి సుధీర్ కుమార్, డాక్టర్ స్వరూప, డాక్టర్ పూర్ణచంద్ర మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.