హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒక్కొటి చొప్పున మొత్తం 49 కేంద్రాల ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది