తేది:13-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇన్చార్జ్ వల్లే ప్రశాంత్.
హన్మకొండ వరంగల్ జిల్లా: ధర్మసాగర్ మండలంలో NIT వరంగల్ అసోసియేట్ ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక రుగ్మతతో బాధపడుతూ మెడికేవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ధర్మసాగర్ రిజర్వాయర్ లో దూకి మృతి చెందారు. ప్రస్తుతం కంప్యూటర్ విభాగంలో పనిచేస్తున్న వెంకట సుబ్బారెడ్డి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా బద్వేల్ అని పోలీసులు గుర్తించారు.