తేది:13-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ జిల్లా:తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసి పోరాడిన అక్షర యోధుడు అల్లం నారాయణ అని టీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.ఆర్ లెనిన్ అన్నారు. వరంగల్ జిల్లా తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు కొరకుల నరేందర్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నవనీత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకలకు టీజీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిఆర్ లెనిన్ ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించారు అని గతంలో ఎన్నడూ లేనివిధంగా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇచ్చిన ఘనత అల్లం నారాయణకే దక్కుతుందని, జర్నలిస్టుల అభ్యున్నతి కై మీడియా అకాడమీ ద్వారా శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి జర్నలిస్టుల అభ్యున్నతికి కృషి చేశాడని, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టు మృతి చెందితే వారికి ఆర్థిక సహాయంతో పాటు ప్రతి నెల పెన్షన్ ఇచ్చిన గనక అల్లం నారాయణకే దక్కుతుందని లెనిన్ అన్నారు ఈ కార్యక్రమంలో టీజేఎఫ్ జిల్లా కార్యదర్శి వంకే శీను కోశాధికారి ఉపేందర్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి నీలం శివ, టీజేఎఫ్ జిల్లా నాయకులు జర్నలిస్టులు బండి రవి , సాక్షి నరేష్, వరంగల్ ప్రెస్ క్లబ్ ఈసీ మెంబర్ కమటం వేణుగోపాల్ టెంజు ఉపాధ్యక్షులు పిండం.విజయ్, ఎండి.అమీర్ టీజేఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు భూసారపు వెంకన్న, వనం భాస్కర్, సోటాల హరినాథ్, చిన్న చందు, కృష్ణ పాల్గొన్నారు.