తేది:12-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: మెట్పల్లి పట్టణం వెల్లుల్ల రోడ్డు నుండి వ్యవసాయ పనులకు రైతులు మల్లె తోటకు పోవుటకు దారి అక్రమనలకు గురి కావడంతో గత బుధవారం రైతులు ధర్నా చేశారన్న విషయం పాఠకులకు తెలిసిందే. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశాలతో ఆర్డీవో, ఎమ్మార్వో,మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఎస్సారెస్పీ అధికారులు సైట్ విసిట్ కి వెళ్ళారని తెలిపారు. త్వరలోనే ఎస్సారెస్పీ డి 32 సర్వే చేయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారని తెలిపారు.జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.