ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొంత మంది సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు, వ్యక్తిత్వ గౌరవానికి భంగం కలిగే విధంగా పోస్టులు పెడుతున్నారంటూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల సోషల్ మీడియాలో సాధారణ జనాలు నుంచి వీఐపీల వరకు తరచుగా ట్రోల్స్ కు గురవుతున్నారు. వ్యక్తిత్వాన్ని హననం చేసేలా పోస్టులు పెడుతూ కొంత మంది పైశాచీక ఆనందం పొందుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం, పర్సనల్ రైట్స్, సోషల్ మీడియా కాంట్రవర్సీ పోస్టులపై, ఏఐ పోస్టులపై గతంలో చిరంజీవి, నాగార్జున సైతం ఢిల్లీ హైకోర్టులో నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో తాజాగా పవన్ కల్యాణ్ సైతం కోర్టును ఆశ్రయించారు. పవన్ కళ్యాణ్ తరపున లాయర్‌లు కోర్టు వారికి పిటిషన్ దాఖలు చేసిన పలు స్క్రీన్ షాట్‌లు కూడా జతచేశారు. కావాలని కొంత మంది రాజకీయ నేతలు, సెలబ్రీటీలను టార్గెట్ చేసి కాంట్రవర్సీలు రాజేస్తు పోస్టులు పెడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ తరపు లాయర్‌లు కోర్టు వారికి విన్నవించారు.
ఈ క్రమంలో సదరు కాంట్రవర్సీ పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకొవాలని కోర్టులో పవన్ తరపు లాయర్‌లు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం.. సోషల్ మీడియా హ్యాండిల్స్ అయిన మెటా, గూగుల్, ఎక్స్‌కు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది. ఇప్పటికే నాగార్జున, చిరంజీవి, ఐశ్వర్యరాయ్, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహర్ వంటి పలువురు సెలబ్రీటీలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.