భారత్ వస్తున్న కార్గో నౌకను యెమెన్ దేశానికి చెందిన హౌతీ రెబల్స్ హైజాక్ చేశారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ఆరోపించింది. ఎర్ర సముద్రంలో ఆదివారం ఆ కార్గో నౌకను హైజాక్ చేశారని తెలిపింది. అయితే నౌకను తామే అదుపులోకి తీసుకున్నామని హౌతీ రెబల్స్ ప్రకటించారు. పలు దేశాలకు చెందిన 25 మంది సిబ్బందితో తుర్కియే నుంచి భారత్‌కు వస్తున్న ఈ కార్గో నౌకను హైజాక్ చేశారని ఇజ్రాయెల్ తెలిపింది. అందులో ఇజ్రాయెలీలెవరూ లేరని వెల్లడించింది.