మరణించిన కొడుకు ఆస్తిపై తల్లికి ఎలాంటి హక్కు ఉండదని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ ఆస్తి భార్యాపిల్లలకు దక్కుతుందని తెలిపింది. 2012లో మరణించిన తన కొడుకు ఆస్తిలో వాటా కావాలని ఓ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. మృతుడికి భార్యా పిల్లలు లేకపోతే అతడి ఆస్తి తండ్రికి దక్కుతుందని, తండ్రి లేకపోతే తల్లికి లేదా సోదరులు, సోదరీమణులకు చెందుతుందన్నారు.