హవేలీ ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికల అవగాహనా సమావేశం అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం.

తేది:10-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS

స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash.

 

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హవేలీ ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా చర్యలు, పోలింగ్ సిబ్బంది బాధ్యతలు, నిఘా వ్యవస్థలపై అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారి నాయకత్వంలో అవగాహనా సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరుగేలా పోలీసులు పూర్తి స్థాయి సిద్ధతతో ఉండాలని సూచించారు.

అదనపు ఎస్పీ సూచనల్లో ముఖ్యాంశాలు

పోలింగ్ స్టేషన్లలో శాంతి భద్రత కట్టుదిట్టంగా ఉండేలా సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని ఆదేశం.

ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని సూచించారు.

పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 100 మీటర్ల పరిధిలో గుమికూడడం నిషేధం.

అనుమానాస్పద వ్యక్తులు లేదా చర్యలు గమనించిన వెంటనే తక్షణ చర్య తీసుకోవాలని సూచించారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో స్ట్రైకింగ్ ఫోర్సులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచార సామగ్రి, పార్టీ గుర్తులు, మొబైల్ ఫోన్లు పూర్తిగా నిషేధం.

మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూలైన్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఉద్రిక్తత సృష్టించే ప్రయత్నాలు, గుంపులు గుమికూడడం, ఓటర్లపై ఒత్తిడి వంటి చర్యలకు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఎన్నికల సమయంలో ప్రతి ఓటరు నిశ్శబ్దంగా, భయంలేకుండా ఓటు వేసే పరిస్థితులు కల్పించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *