ప్రముఖ నటి శ్రియా శరణ్ మంగళవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. బుధవారం వేకువజామున ఆమె తన భర్త ఆండ్రీ కోస్చివ్ మరియు కుమార్తె రాధ శరణ్‌తో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. కుమార్తె రాధ శరణ్‌ను ఎత్తుకుని, తల్లి నీరజతో కలిసి శ్రియా సంప్రదాయ వస్త్రధారణలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
శ్రీవారి సుప్రభాత సేవ అనంతరం, రంగనాయకుల మండపంలో వేదపండితులు నటి శ్రియాకు ఆశీర్వచనాలు చేశారు. దర్శనం పూర్తి చేసుకున్న శ్రియా, ఆలయం ముందు భక్తులను చూసి వారితో సరదాగా పలకరించారు.
శ్రియా, ఆండ్రీ దంపతులు తరచూ తమ సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈసారి శ్రీవారి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చి, అత్యంత పవిత్రమైన సుప్రభాత సేవలో పాల్గొనడం విశేషం.