అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ-జనసేన ఉమ్మడిగా ప్రచారం నిర్వహించనున్నాయి. మంగళవారం జూబ్లీహిల్స్ లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ముషీరాబాద్ లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ రోడ్ షోలు నిర్వహిస్తారు. ఈనెల 22న వరంగల్ లో జరిగే సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరవుతారు. 26న కేంద్రమంత్రి అమిత్ షాతో కలిసి హైదరాబాద్ లో పవన్ ప్రచారం చేస్తారు. 25, 26, 27 తేదీల్లో మొత్తం 6 సభల్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.