తేదీ 09-12-2025 సంగారెడ్డి జిల్లా, TSLAWNEWS
సదశివపేట: సదాశివపేట మండలం ఎంపీ యుపిఎస్ చందాపూర్ పాఠశాలలో నమోనా గ్రామపంచాయతీ ఎన్నికలను చందాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఓటు వేసే విధానాన్ని విద్యార్థులకు తెలియజేశారు. తల్లిదండ్రులకు కూడా విద్యార్థులు ఇంటి వద్ద చెప్పాలని సూచించారు. చందాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు లేకుండా అవగాహన కల్పించాలని విద్యార్థులకు తెలిపారు. చిన్నప్పటినుండి ఓటు హక్కు పై అవగాహన కలిగి ఉండాలని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు.గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచినా వారు ఊరి అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు…ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి ప్రసాద్ ఉపాధ్యాయులు స్వప్న కుమారి, భాగ్యశ్రీ, విద్యార్థులు, పాల్గొన్నారు…