
తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో మైలురాయిగా నిలిచిన 2009 డిసెంబర్ 9 సందర్భాన్ని పురస్కరించుకొని, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ‘విజయ దివస్’ను భారీ స్థాయిలో నిర్వహించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, మాజీ మంత్రి శ్రీ హరీష్ రావు గారి పిలుపు మేరకు పటాన్చెరు నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారితో కలిసి మాదిరి ప్రిథ్వీరాజ్ గారు స్థానిక ఐ.బి బంగ్లా ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, పాలాభిషేకం చేసి రాష్ట్ర సాధనలో తెలంగాణ తల్లి పాత్రకు ఘన నివాళి అర్పించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు అర్పించి వందనాలు సమర్పించారు. తరువాత పటాన్చెరులోని ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్ర సాధన ప్రజల ఆకాంక్ష. 2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటించడం తెలంగాణ చరిత్రను మార్చిన రోజు. ఆ రోజును గుర్తుచేసే ‘విజయ దివస్’ కార్యక్రమం ప్రతి తెలంగాణ వ్యక్తికి గర్వకారణం. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కలిసి ముందుకు సాగాలి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ గారు, తెల్లపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ తొంటే అంజయ్య గారు, శ్రీధర్ చారి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు మరియు MPR యువసేన సభ్యులు పాల్గొన్నారు. ప్రజలు, యువత భారీగా హాజరై ‘జై తెలంగాణ’ నినాదాలతో కార్యక్రమాన్ని సందడిగా మార్చారు.