హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ తాజా నివేదిక ప్రకారం..కరోనా వైరస్ కారణంగా గత రెండు నెలల్లో ముకేశ్ నికర విలువలో దాదాపు 19 బిలియన్ డాలర్లు (రూ.1.44 లక్షల కోట్లు) నష్టాన్ని మూటగట్టుకున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో రూ.1,400గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీ షేర్ల విలువ ఏప్రిల్ 3వ తేదీ నాటికి 1,077కి పడిపోయింది. కోవిడ్-19 సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నష్టపోయిన ధనికుల్లో అంబానీ రెండో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో ఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గజం ఎఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గజం ఎల్‌వీఎంహెచ్ అధినేత బెర్నాడ్ అర్నౌల్ట్ ఉన్నారు. ఈయన సంపద 28 శాతం లేదా 30 బిలియన్ డాలర్లు తగ్గి 77 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక అమెజాన్ జెఫ్ బెజోస్ 131 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. గత రెండు నెలల్లో కేవలం 9 శాతం మాత్రమే పడిపోయింది. బిల్ గేట్స్ 91 బిలియన్ డాలర్ల (14 శాతం తగ్గింది)గా వుంది.