కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. “కేసీఆర్‌కు మళ్లీ అధికారమిస్తే ఫామ్ హౌస్, ప్రగతి భవన్‌కే పరిమితం అవుతారు. దళిత ముఖ్యమంత్రి, రేషన్ కార్డులు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయి?” అని ఈటల ప్రశ్నించారు.