
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్‌లో దత్తాత్రేయ స్వామివారి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు, జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ గారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమ ప్రవేశద్వారం వద్ద అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ దత్తగిరి ఆశ్రమ మహారాజు శాలువా కప్పి సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఝరసంఘం మండల అధ్యక్షుడు హనుమంత్ రావు పాటిల్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, సంగ్రామ్ పాటిల్ గారు, మారుతి గారు, ఏఎంసి డైరెక్టర్ శేఖర్ గారు తదితరులు పాల్గొన్నారు.