టీఎస్ లా న్యూస్ జగిత్యాల జిల్లా ఇంచార్జిగా సంజయ్ రెడ్డి నియామకం
ప్రజా సమస్యల పరిష్కారం కోసం : లా న్యూస్ సంస్థ ప్రొప్రైటర్ ఎడిటర్ కోవూరి సత్యనారాయణ
హైదరాబాద్ బ్యూరో (సామాజిక తెలంగాణ న్యూస్)
టీఎస్ లా న్యూస్ జగిత్యాల జిల్లా ఇంచార్జిగా సంజయ్ రెడ్డిని నియమిస్తున్నట్టు లా న్యూస్ సంస్థ ప్రొప్రైటర్ ఎడిటర్ కోవూరి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ చానల్ పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానమై లక్ష్యాలు : ప్రజలకు వారి హక్కుల గురించి, చట్టాల గురించి న్యాయవ్యవస్థ గురించి, అవగాహన కలిగించడము. ఒక వ్యక్తికి ఒక సమస్య ఎదురైనప్పుడు అతడు ఆ సమస్యను తీసుకుని ఏ అధికారి దగ్గరకు వెళ్లాలి ఏ విధంగా , అర్జీ ఇవ్వాళ అని ఈ చానెల్ తెలియచెబుతుంది అని తెలిపారు. కోర్టుకు వెళ్లవలసి నటువంటి సమస్యల్లో ఏ కోర్టుకు వెళ్లాలి, ఎంత కోర్టు ఫీజు కట్టాలా తెలియజేస్తుంది. అదే విధముగా మహిళలకు, దళితులకు, ఆదివాసులకు, ఉన్న ప్రత్యేకమైన హక్కులు ఏమిటి, వారికి ప్రభుత్వం ద్వారా ఎటువంటి న్యాయ సహాయం అందుతుంది, న్యాయ సహాయం కోసం ఎవరిని సంప్రదించాలి తెలియజేస్తుంది. ప్రజలకు ఉండేటటువంటి ప్రాథమిక హక్కులు, మానవ హక్కుల గురించి తెలియజేస్తుంది.
ప్రమాదానికి గురైన వారికి / భూమిని కోల్పోయిన వారికి ఎటువంటి నష్టపరిహారమూ దొరుకుతుందో తెలియజేస్తుంది. మానవ మనుగడకు భంగము కలిగించేటటువంటి సమస్యల యొక్క పరిష్కారము కొరకు నిరంతరము పనిచేస్తుంది. విద్యార్థులు, వ్యవసాయదారులు, నిరుద్యోగ స్తులు, వ్యాపారస్తుల పట్ల కాలానుగుణంగా అభివృద్ధి పథంలో నడిపించడానికి వారి యొక్క శ్రేయస్సు కోరుతుంది.అన్ని రంగాలలో అన్ని విషయాల పట్ల చట్టంపైన అవగాహనను కలిగిస్తుంది అని తెలిపారు.టీఎస్ లా న్యూస్ జగిత్యాల జిల్లా పూర్తి బాధ్యతలు సంజయ్ రెడ్డికి ఇస్తున్నట్టు సంస్థ ప్రొప్రైటర్ ఎడిటర్ కోవూరి సత్యనారాయణ తెలియజేస్తూ త్వరలో జగిత్యాల జిల్లాలో కమిటీలు వేయాలని తెలిపారు. జిల్లా బాధ్యతలు పరిపూర్ణంగా నిర్వహిస్తానని సంజయ్ రెడ్డి తెలిపారు.